పోలీస్ గా నాగచైతన్య....

Sunday,November 13,2016 - 01:31 by Z_CLU

లవర్ బాయ్ నాగచైతన్య మరోసారి మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. మాస్ ఇమేజ్ సంపాదించేందుకు బెజవాడ, ఆటోనగర్ సూర్య, దడ లాంటి సినిమాలు చేసిన ఈ అక్కినేని హీరో… మరోసారి ఆ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడట. తాజా సమాచారం ప్రకారం… ఈసారి నాగచైతన్య పోలీస్ పాత్రలో మెరవాలని అనుకుంటున్నాడట. దీనికి ఓ కారణం కూడా ఉంది. తాజాగా విడుదలైన సాసహం శ్వాసగా సాగిపో సినిమాలో నాగచైతన్య పోలీస్ గా కనిపిస్తాడు. ఆ ఎప్పీయరెన్స్ కు అక్కినేని ఫ్యాన్స్ ఫిదా అయిపోయాారు.

5
దీంతో టోటల్ సినిమానే పోలీస్ గెటప్ తో కనిపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో చైతూ ఉన్నాడట. ఈ మేరకు నిర్మాత సురేష్ బాబుతో చర్చలు కూడా జరిపాడట. త్వరలోనే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడు నాగచైతన్య. ఆ విషయాన్ని ఇప్పటికే ప్రకటించిన చైతూ…ఆ బ్యానర్ పై చేయబోయే సినిమాలో పోలీస్ పాత్రను ట్రై చేయాలని అనుకుంటున్నాడట. త్వరలోనే జరగనున్న సాహసం శ్వాసగా సాగిపో సక్సెస్ మీట్ లో… దీనిపై ఓ క్లారిటీ ఇవ్వబోతున్నాడట మన అక్కినేని యువసామ్రాట్.