Dhanush Venky Atluri - ధనుష్ తొలి తెలుగు మూవీ లాంఛ్

Monday,January 03,2022 - 04:47 by Z_CLU

Dhanush’s Telugu-Tamil bilingual SIR/Vaathi, directed by Venky Atluri, produced by Sithara Entertainments and Fortune Four Cinemas, formally launched

నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో సహ-నిర్మాతగా సినిమా లాంఛ్ అయింది. జాతీయ అవార్డు గ్రహీత స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ఇది. దీని పేరు సర్. తమిళంలో దీనికి వాతి అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ లాంఛ్ గ్రాండ్ గా జరిగింది. ఇటీవ‌ల‌ ‘రంగ్‌దే’ చిత్రానికి దర్శకత్వం వహించిన యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Dhanush Venky Atluri Sir Movie

సినిమా హీరోహీరోయిన్లు ధనుష్, సంయుక్త మీనన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి, ప్రముఖ నిర్మాత డా: కె.ఎల్.నారాయణ కెమెరా స్విచాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ అందచేశారు.

Dhanush Venky Atluri Sir Movie

జనవరి 5 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమౌతుంది.

కేరళకు చెందిన చార్మింగ్ సెన్సేషన్ సంయుక్తా మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.