Dhanush శేఖర్ కమ్ముల - ధనుష్ మూవీ లాంచ్

Monday,November 28,2022 - 01:15 by Z_CLU

Dhanush, Sekhar Kammula,’s Trilingual Film Launched Grandly

నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ (Dhanush) ,సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది.  ఎనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురుచూసిన మూవీ లవర్స్ కి క్లాప్ కొట్టి గుడ్ న్యూస్ చెప్పేశారు. హైదరాబాద్ లో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా తెలుగు , తమిళ్ , హిందీ మూడు భాషల్లో ఒకే సారి తెరకెక్కనుంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP , ఏమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్  బేనర్స్ పై సునీల్ నారంగ్ , రామ్ మోహన్ రావు పుస్కూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే టెక్నీషియన్స్ డీటెయిల్స్ తెలియనున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics