18 Pages డిసెంబర్ 5న సెకండ్ సింగిల్

Monday,November 28,2022 - 01:10 by Z_CLU

Time Ivvu Pilla song from ’18 Pages’ release on Dec 5th

నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ’18 పేజేస్’ (18 Pages) నుండి ఇటివలే రిలీజైన ‘నన్నయ్య రాసిన’ సాంగ్ సూపర్ హిట్ అనిపించుకొని మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఆల్బం నుండి రెండో సాంగ్ రాబోతుంది. కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడిన “టైం ఇవ్వు పిల్లా” అనే సాంగ్ ను డిసెంబర్ 5 న రిలీజ్ చేయబోతున్నారు.

గోపిసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ ఎనర్జిటిక్ సాంగ్ కి శ్రీమణి అందించిన లిరిక్స్ ఆకట్టుకుంటాయని టీం చెప్తుంది. ఇక శింబు తెలుగులో పాడిన “బుజ్జి పిల్ల” తో పాటు రీసెంట్ గా వారియర్ సినిమాలో పాడిన బుల్లెట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి. బులెట్ సాంగ్ ఇప్పటికే మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టి రీసెంట్ టైంలో బెస్ట్ సాంగ్ అనిపించుకుంది.

ఈ నేపథ్యంలో శింబు పాడిన 18 పేజేస్ సాంగ్ ఏ రేంజ్ హిట్టవుతుందో అని మ్యూజిక్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics