టాలీవుడ్ లో మరో బెస్ట్ మల్టీస్టారర్

Sunday,September 30,2018 - 11:22 by Z_CLU

కొన్ని మల్టీస్టారర్ కాంబినేషన్ సినిమాలు లాంచ్ నుండే ఆడియన్స్ ని విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తుంటాయి.. అలాంటి కాంబినేషననే నాగార్జున , నాని ది కూడా. నాగార్జున కి మల్టీ స్టారర్ కొత్తేం కాదు.. అప్పట్లో తన తోటి హీరోలతో పాటు ఆ మధ్య యంగ్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకొని మెస్మరైజ్ చేసాడు కింగ్.. అయితే సీనియర్ హీరోతో కలిసి మల్టీ స్టారర్ చేయడం నానికి మాత్రం కొత్తే..

కెరీర్ స్టార్టింగ్ నుండి తనకంటూ ఓ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ నేచురల్ స్టార్ గా దూసుకుపోతున్న నాని నాగ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తెలుగు ప్రేక్షకుల్లో భలే క్యూరియాసిటీ నెలకొల్పింది. నానితో కలిసి ఎప్పటి నుండో ఓ సినిమా చేద్దామనుకుంటున్నా ఫైనల్ గా ఇప్పటికి కుదిరింది అంటూ నాగ్ కూడా మీడియా ముఖంగా చెప్పడంతో ఈ క్రేజీ కంబోపై మరింత పాజిటీవ్ బజ్ వచ్చింది.

‘దేవదాస్’ తో థియేటర్స్ లోకొచ్చిన నాగ్ & నాని ఆడియన్స్ ను భలే ఎంటర్టైన్ చేసారు.. రెగ్యులర్ కథే అయినప్పటికీ వీరిద్దరు తమ కాంబినేషన్ సీన్స్ తో స్క్రీన్ మీద మేజిక్ చేశారు. దేవా.. దాస్ ఉన్న సన్నివేశాలు అటు అక్కినేని ఫాన్స్, నాని ఫాన్స్ కి భలే కనువిందు చేసాయి. నిజానికి ఈ కాంబో ఇప్పటి వరకూ ఎవరూ ఊహించలేదు అందుకే ఓపెనింగ్ నుండే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఫైనల్ గా టాలీవుడ్ లో వచ్చిన కొన్ని బెస్ట్ మల్టీ స్టారర్ సినిమాల్లో దేవదాస్ కూడా ఒకటి అనిపించుకుంది.. ఓన్లీ బికాజ్ ఆఫ్ నాగ్ & నాని.. ఇలాంటి కాంబినేషన్స్ తెలుగులో మరిన్ని రావాలని ఆశిస్తూ జీ సినిమాలు తరుపున నాగార్జున, నానికి శుభాకాంక్షలు.