దేవదాస్ 3 రోజుల కలెక్షన్

Sunday,September 30,2018 - 11:51 by Z_CLU

రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది దేవదాస్ సినిమా. నాగ్, నాని కలిసి నటించిన ఈ హిలేరియస్ మల్టీస్టారర్ సూపర్ హిట్ వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటిరోజే అత్యధిక వసూళ్లతో రికార్డు సృష్టించిన ఈ సినిమా నిన్నటితో 3 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఈ 3 రోజుల్లో దేవదాస్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల 63 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 3.28 కోట్లు
సీడెడ్ – రూ. 1.25 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.16 కోట్లు
ఈస్ట్ – రూ. 0.65 కోట్లు
వెస్ట్ – రూ. – 0.48 కోట్లు
గుంటూరు – రూ. 0.86 కోట్లు
కృష్ణా – రూ. 0.64 కోట్లు
నెల్లూరు – రూ. 0.33 కోట్లు