ఇంత మంచి సీన్ ఎందుకు డిలీట్ చేశారు?

Sunday,September 30,2018 - 11:58 by Z_CLU

దేవదాస్ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా డిలీటెడ్ సీన్లను అప్ లోడ్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా నాని నటించిన ఓ పవర్ ఫుల్ సన్నివేశాల్ని యూట్యూబ్ లో పెట్టారు. ఈ సీన్ చూసిన వెంటనే సోషల్ మీడియాలో ఈ డిస్కషన్ మొదలైంది.

బాగా ఎమోషనల్ అయిన నాని, రావురమేష్ దగ్గరకొచ్చి క్లాస్ పీకే సీన్ ఇది. సినిమాలో ఈ సీన్ లేదు. జస్ట్ రావురమేష్, నానిని బయటకు పంపించడం వరకే ఉంటుంది. కట్ చేస్తే నాని వెళ్లి, హాస్పిటల్ ఛైర్మన్ ఛాంబర్ లో ఉంటాడు. ప్రేక్షకులందరికీ ఇంతవరకే తెలుసు. కానీ ఈ రెండు సన్నివేశాల మధ్య వచ్చిన ఈ సీన్ ను ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టారు.

నిజంగా ఈ సన్నివేశంలో దాస్ పాత్రలో నాని బ్రహ్మాండంగా నటించాడు. సీన్ చాలా బాగుంది. యూట్యూబ్ లో తెగ హిట్స్ వస్తున్నాయి. అందుకే ఇంత మంచి సీన్ ను ఎందుకు తొలిగించారంటూ సోషల్ మీడియాలో డిస్కషన్లు జరుగుతున్నాయి.