Daggubati Abhiram - సైలెంట్ గా మొదలెట్టేశాడు

Monday,July 05,2021 - 05:30 by Z_CLU

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో పరిచయమవుతున్నాడు. సురేష్ బాబు చిన్న కొడుకు , రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా సినిమా చేస్తున్నాడు. తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా లాంచ్ అవ్వబోతున్న సినిమా నిన్న రామానాయుడు స్టూడియోస్ లో సింపుల్ గా ప్రారంభమైంది. ఓపెనింగ్ ఈవెంట్ కి వెంకటేష్ , రానాలతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీలో నుండి నలుగురు , అలాగే ఇద్దరు ప్రముఖ నిర్మాతలు మాత్రమే పాల్గొన్నారు.

తేజ దర్శకుడిగా సురేష్ ప్రొడక్షన్స్ , ఆనంది ఆర్ట్స్ సంస్థలపై సురేష్ బాబు , జెమిని కిరణ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. RP పట్నాయక్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం లోకేషన్స్ వేటలో ఉన్నాడు తేజ. జులై నెలాఖరు నుండి సినిమా షూటింగ్ మొదలు కానుంది. ముందుగా హైదరాబాద్ లో ఒక షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు తేజ ‘అహింస’ అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారని సమాచారం. త్వరలోనే టైటిల్ పై క్లారిటీ రానుంది. అలాగే అభిరాం సరసన హీరోయిన్ ఇంకా ఫైనల్ అవ్వలేదు.ఈ సినిమా ద్వారా కొత్త అమ్మాయిని పరిచయం చేసే ప్లానింగ్ లో ఉన్నాడు తేజ. హీరోయిన్ తో పాటు టెక్నీషియన్స్ కూడా ఫైనల్ చేసి త్వరలోనే సినిమా డీటెయిల్స్ తెలియజేయనున్నారు. మరి దగ్గుబాటి ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయమవుతున్న అభిరాం మొదటి సినిమాతో నటుడిగా ఎలాంటి గుర్తింపు అందుకుంటాడో వేచి చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics