మహేష్ కోసం మినీ స్టార్ హోటల్

Saturday,March 20,2021 - 02:13 by Z_CLU

టాలీవుడ్ హీరోల్లో మంచి కారవాన్ ఎవరిదగ్గర ఉందంటే వెంటనే వచ్చే సమాధానం అల్లు అర్జున్. రీసెంట్ గా తన టేస్ట్ కు తగ్గట్టు మంచి వ్యానిటీ వ్యాన్ ను సిద్ధం చేసుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు దాన్ని తలదన్నే రీతిలో మరో కారవాన్ రాబోతోంది. ఇంకా చెప్పాలంటే ఆ కారవాన్ ఓ మినీ స్టార్ హోటల్ లా ఉండబోతోంది.

mahesh caravan

దాదాపు 8 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి హీరో మహేష్ బాబు ఈ వ్యానిటీ వ్యాన్ ను సిద్ధం చేయిస్తున్నాడు. పూణెలో రెడీ అయిన ఈ కారవాన్ తాజాగా మహేష్ కు అందుబాటులోకి వచ్చింది. మహేష్ టేస్ట్ కు తగ్గట్టు సర్వ హంగులు ఇందులో ఉన్నాయి.

బెడ్ రూమ్, బాత్ రూమ్, కిచెన్, సోఫా సెట్, రివాల్వింగ్ ఛెయిర్, టీవీతో పాటు మరెన్నో హంగులు ఈ కారవాన్ సొంతం. ఇవన్నీ ఒకెత్తయితే, ఇందులో ఇంటీరియర్ మరో ఎత్తు అంటున్నారు. వరల్డ్ క్లాస్ ఇంటీరియర్ ఇందులో కనిపిస్తుందట. ప్రస్తుతం టాలీవుడ్ లో కాస్ట్ లీ కారవాన్ ఇదే.

mahesh caravan

సకల సదుపాయాలతో సిద్ధమైన ఈ కారవాన్ త్వరలోనే మహేష్ కు షూటింగ్ లొకేషన్ లో సేదతీరడానికి  అందుబాటులోకి రాబోతోంది.