రవితేజ తో రామ్ చరణ్ ?

Saturday,March 20,2021 - 01:12 by Z_CLU

ఇతర భాషల్లో విడుదలై మంచి విజయం అందుకున్న సినిమాల రీమేక్ రైట్స్ ని ఎప్పటికప్పుడు మన నిర్మాతలు చేజిక్కించుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. తాజాగా అలాంటి ఓ సూపర్ హిట్ సినిమాకు సంబంధించి తెలుగు రీమేక్  రైట్స్ తీసుకున్నాడు మెగా పవర్ స్టార్. ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే  మలయాళ సినిమా చూసి వెంటనే రీమేక్ రైట్ కొనుగోలు చేశాడు చరణ్.

ఈ రీమేక్ సినిమాను ముందుగా తనే చేయాలనుకున్నాడు చరణ్. కాకపోతే  శంకర్ డైరెక్షన్ లో ఓ భారీ సినిమా చేయాల్సి రావడంతో ఇప్పుడా రీమేక్ సినిమాను రవితేజతో తీయాలనుకుంటున్నాడని తెలుస్తుంది.  ఒరిజినల్ లో పృథ్వి చేసిన హీరో క్యారెక్టర్ ను మాస్ మహారాజాతో చేయించి ఆర్టివో క్యారెక్టర్ ను మరో హీరోతో చేయించాలని భావిస్తునాడట చరణ్. ప్రస్తుతానికయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా డిస్కషన్ స్టేజిలోనే ఉంది.   రమేష్ వర్మతో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్న రవితేజ నెక్స్ట్ త్రినాద్ రావు నక్కినతో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా తర్వాత  రామ్ చరణ్ నిర్మాతగా ఈ రీమేక్ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.