బాలయ్య 101 సినిమాపై క్లారిటీ

Wednesday,February 22,2017 - 03:48 by Z_CLU

బాలయ్య 101 సినిమాపై సినీ టౌన్ లో కాస్త సీరియస్ గానే డిస్కషన్స్ నడుస్తున్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణీ తరవాత ఇంకా తన తరవాతి సినిమాపై సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న బాలయ్య, ఇప్పటి వరకు ఫలానా డైరెక్టర్ అని కానీ, ప్రొడ్యూసర్ అని కానీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు. ఏముంది ఈ గ్యాప్ కాస్త సినీ టౌన్ లో బోలెడన్ని గాసిప్స్ కి రిబ్బన్ కట్ చేస్తుంది.

ఎంతవరకు నిజం ఉందో తెలీదు కానీ బాలయ్య తన నెక్స్ట్ సినిమా కోసం K.S. రవికుమార్ డైరెక్షన్ లో ‘రెడ్డి గారు’, ‘జయ సింహ’ టైటిల్స్ ని కాస్త సీరియస్ గానే పరిశీలిస్తున్నారనే టాక్, టాలీవుడ్ లో ఓ రేంజ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ వైబ్రేషన్ కంట్రోల్ లోకి కూడా రాలేదు, అప్పుడే ఇంకో న్యూస్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.

K.S. రవికుమార్ డైరెక్షన్ లో సినిమా రేపో మాపో కన్ఫం అవుతుందని ఫ్యాన్స్ ఇలా మైండ్ సెట్ చేసుకున్నారో లేదో, మాసివ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో బాలయ్య సినిమా కన్ఫం అన్న న్యూస్ ఏకంగా నందమూరి ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్ ప్రకారం ఈ సినిమా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై మార్చ్ లో సెట్స్ పైకి వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ గా బాలయ్య సర్కిల్ లో జరుగుతున్న ఫార్మల్ డిస్కషన్స్ ఏంటో తెలీడం లేదు కానీ… ఈ సస్పెన్స్ కి చెక్ పడకపోతే, ఎగ్జైట్ మెంట్ లో జెనెరేట్ అయ్యే హాట్ హాట్ కాంబో లకు ఇప్పట్లో శుభం కార్డు మాత్రం పడదు.