ఈ సంక్రాంతికి మెగాస్టార్ Vs సూపర్ స్టార్

Saturday,May 16,2020 - 02:27 by Z_CLU

ప్రతి సంక్రాంతికి పోటీ తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఏడాది సంక్రాంతినే తీసుకుంటే.. మహేష్-బన్నీ ఓ రేంజ్ లో పోటీపడ్డారు. వచ్చే ఏడాదికి కూడా ఇప్పట్నుంచే సినిమాలు సిద్ధమౌతున్నాయి. అయితే పోటీ మాత్రం మరింత రంజుగా మారబోతోంది.

అవును.. వచ్చే సంక్రాంతికి సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి తలపడే అవకాశాలు చాలా ఉన్నాయి. రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తె సినిమాను దీపావళికి అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

అటు మెగాస్టార్ ఆచార్యది కూడా ఇదే పరిస్థితి. లాక్ డౌన్ కారణంగా మూవీ షూట్ లేట్ అవుతోంది. దీంతో సంక్రాంతికే విడుదల చేసే ఆలోచనలో ఉంది యూనిట్. ఆచార్య కూడా సంక్రాంతికొస్తే మెగాస్టార్ Vs సూపర్ స్టార్ అన్నమాట.

అయితే సంక్రాంతికి ఆల్రెడీ RRRను షెడ్యూల్ చేశారు. లెక్కప్రకారం జనవరి 8న ఆ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ మారిన పరిస్థితుల వల్ల ఆ తేదీకి RRR రాకపోవచ్చంటున్నారు చాలామంది. సో.. RRR తప్పుకుంటే.. చిరు-రజనీ బాక్సాఫీస్ వార్ దాదాపు పక్కా అయినట్టే.