ఫ్యాన్స్ ను ఖుషి చేయబోతున్న మహేష్

Saturday,May 16,2020 - 02:06 by Z_CLU

మహేష్ -పరశురాం సినిమాకు సంబంధించి పీ ప్రొడక్షన్ పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు మరికొందరు టెక్నీషియన్స్ ను ఫైనల్ చేసుకున్నారు. స్క్రిప్ట్ కూడా లాక్ అయిపొయింది. అనౌన్స్ మెంట్ ఒక్కటే బ్యాలెన్స్. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్బంగా ఈనెల 31న ఈ సినిమాను పోస్టర్ లేదా మోషన్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ను ఖుషి చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

లాక్ డౌన్ అవ్వగానే మహేష్ ఈ సినిమాను సెట్స్ పై పెట్టనున్నాడు. ఈలోగా పరశురాం సినిమాలో హీరోయిన్ తో పాటు మిగతా కాస్టింగ్.. అలాగే లోకేషన్స్ పై ఫోకస్ పెట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి.

అయితే ఈ మూవీతో పాటు రాజమౌళితో చేయబోయే సినిమాను కూడా మహేష్ ప్రకటిస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.