Chiranjeevi Acharya - లేటెస్ట్ అప్ డేట్స్

Monday,May 24,2021 - 10:47 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆచార్య సినిమాకు సంబంధించి ఒకేసారి బోలెడన్ని అప్ డేట్స్ వచ్చాయి. అవేంటో వరుసగా చూసేద్దాం.

 ఆచార్య షూటింగ్ ఇంకా 10-12 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. షూటింగ్స్ ఎప్పుడు మొదలైతే అప్పుడు ఆ 10 రోజుల షూట్ కంప్లీట్ చేసి, గుమ్మడికాయ కొట్టేస్తారు

 సెకెండ్ సింగిల్ రెడీ అయింది. త్వరలోనే మంచి టైమ్ చూసి రిలీజ్ చేస్తారు. రామ్ చరణ్, పూజాహెగ్డేపై తీసిన రొమాంటిక్ సాంగ్ ఇది. టోటల్ సినిమాకే ఇది హైలెట్ అంటున్నారు.

 అంతా అనుకుంటున్నట్టు సినిమాలో చరణ్ 25 నిమిషాలు మాత్రమే కనిపించడు. దాదాపు ఆచార్య సెకండాఫ్ మొత్తం చరణ్ కనిపిస్తాడు.

 సినిమాకు మెయిన్ ఎమోషన్ చరణ్ చేసిన సిద్ధ పాత్ర. ఇంకా చెప్పాలంటే కథ మొత్తం సిద్ధ చుట్టూనే తిరుగుతుంది. సిద్ధ లేకపోతే ఆచార్య లేదు.

 ఈ సినిమాలో చిరు-చరణ్ తండ్రికొడుకులుగా నటించడం లేదు. వాళ్ల పాత్రల మధ్య బ్లడ్ రిలేషన్ ఉండదు.

 సినిమాకు టెంపుల్ సెట్ మరో హైలెట్. సినిమాలో చరణ్, చిరంజీవి ఎంతలా ఎట్రాక్ట్ చేస్తారో.. టెంపుల్ టౌన్ అంతే ఎట్రాక్ట్ చేస్తుంది. నిజం చెప్పాలంటే సినిమా చూస్తున్నప్పుడు అది సెట్ అనే ఫీలింగ్ కలగదు. కథలో కలిసిపోతుంది.

 బజ్ కోసం చరణ్ ను పెట్టలేదు. సినిమాలో సిద్ధ పాత్రకు ఓ స్టార్ కావాలి. అందుకే చరణ్ ను తీసుకున్నాం. చరణ్ క్యారెక్టర్ ఎమోషన్ తోనే సినిమా స్టార్ట్ అవుతుంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics