NTR Koratala Movie - క్రేజీ అప్ డేట్!

Monday,May 24,2021 - 11:35 by Z_CLU

ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు కొరటాల శివ. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే ఎన్టీఆర్ తో కలిసి మరోసారి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. సినిమా ప్రకటించినప్పుడే ఈ సారి రిపేర్లు పాన్ ఇండియా లెవెల్లో జరుగుతాయంటూ జనతా గ్యారేజీ స్టయిల్ లో చెప్పకనే చెప్పాడు కొరటాల. ఇంతకీ ఎన్టీఆర్-కొరటాల శివ అప్ డేట్ ఏంటి.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఎంత వరకు వచ్చింది.

“ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా పని మీదే ఉన్నాను. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. దాదాపు 90 శాతం వర్క్ పూర్తయింది. మరోసారి చూసుకోవాలి. ఆ తర్వాత ఎన్టీఆర్ ను కలవాలి. కొంచెం టైం పడుతుంది”

ఇలా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు కొరటాల. కరోనా వల్ల ఆచార్య షూటింగ్ ఆగిపోవడంతో, ఇప్పుడు తన టైమ్ మొత్తాన్ని ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పైనే పెట్టాడు.

కొరటాల ఏ సినిమా చేసినా ముందుగా కోర్ పాయింట్ రాసుకుంటాడు. దానిచుట్టూ ఉండే ఎపిసోడ్ ను ఫినిష్ చేస్తాడు. ఆ తర్వాతే హీరోగా దగ్గరకు వెళ్తాడు. ఏ హీరో ఒప్పుకుంటే, ఆ హీరో ఇమేజ్ కు తగ్గట్టు మిగతా సినిమా రైటింగ్ మొత్తం మారుస్తాడు. అంతేతప్ప, కోర్ పాయింట్ లో మాత్రం ఎలాంటి మార్పుచేర్పులు ఉండవు.

హీరో ఎవరైనా, సినిమాకు సంబంధించి తను అనుకున్న మెయిన్ పాయింట్, ఆ ఎపిసోడ్ ను యాజ్ ఇటీజ్ గా తీస్తానని.. ఎన్టీఆర్ సినిమాకు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నానని తెలిపాడు కొరటాల శివ. తన పాత సినిమాల స్టయిల్ లోనే తారక్ తో చేయబోయే సినిమా కూడా ఉంటుందని, ఓ సామాజిక సందేశంతో పాటు మరికొన్ని ప్రత్యేక అంశాలుంటాయని అంటున్నాడు కొరటాల.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics