"బృందావనమది అందరిది" షూటింగ్ ప్రారంభం

Monday,November 27,2017 - 08:34 by Z_CLU

జస్ట్ ఎంటరర్ టైన్ మెంట్ క్రియేషన్స్ పతాకం పై శ్రీనివాస్ వంగల ప్రభాకర్ రెడ్డి నిర్మాతలుగా సక్సెస్ ఫుల్ రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “బృందావనమది అందరిది “ఈ చిత్రం హైదరాబాద్ లోని సినిమా ఆఫీస్ లో టెక్నిసియాన్స్ సమక్షం లో సింపుల్ గా షూటింగ్ ప్రారంభం అయ్యింది.

మొదటి షాట్ ని దేవుడి పట్టాలపై చిత్రీకరించారు. ఫస్ట్ షాట్ కి కెమెరా సి రాంప్రసాద్ స్విచ్ ఆన్ చేయగా  పృద్వి క్లాప్ కొట్టాడు. మరోవైపు మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతున్నాయి. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

ఈ సినిమా కోసం అడిషన్స్ లో సెలెక్ట్ అయిన నటీనటులను డిసెంబర్15 న మీడియా ద్వారా పరిచయం చేస్తారు. డిసెంబర్ 20 నుండి కేరళలో పాటల చిత్రీకరణ తో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

సంగీతం : మణిశర్మ
కెమెరా : రాంప్రసాద్
ఎడిటర్  : ప్రవీణ్ పూడి
ఆర్ట్ డైరెక్టర్ : తిరుమల
కొరియోగ్రాఫర్ : రఘు
పాటలు : రామజోగయ్య శాస్త్రి
సహా నిర్మాత : రామిరెడ్డి
నిర్మాతలు :
శ్రీనివాస్ వంగాల
ప్రభాకర్ రెడ్డి కూతురు
కో డైరెక్టర్ విజయ సారధి
రచన దర్శకత్వం శ్రీధర్ సీపాన