హీరోయిన్ సీక్రెట్ ఎఫైర్

Thursday,April 09,2020 - 05:11 by Z_CLU

“నాకు ఓ సీక్రెట్ అఫైర్ ఉంది. కాకపోతే ఇంకా కమిట్ కాలేదు. అయితే ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని ఇప్పుడే బయటికి చెప్పలేను. చెబితే మీడియాలో ఆడుకుంటారు.”

హీరోయిన్ బిందుమాధవి లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. రామరామ కృష్ణకృష్ణ, బంపర్ ఆఫర్ లాంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తను డేటింగ్ చేస్తున్న విషయాన్ని ఇలా బయటపెట్టింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది చెప్పనంటోంది.

మరోవైపు తెలుగులో అవకాశాలు రాకపోవడంపై మాట్లాడుతూ.. దానికి తన దగ్గర సమాధానం లేదంటోంది బిందు మాధవి.