బాలీవుడ్ పెద్దాయన అదరగొట్టాడు

Wednesday,March 14,2018 - 04:22 by Z_CLU

ఈ ఫొటోలో ఉన్నది ఎవరో అనుకుంటున్నారా..? చిత్ర విచిత్రంగా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ ఇదే. ఇది ఇంత పాపులర్ అవ్వడానికి ఓ కారణం ఉంది. కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఆ విషయం మీకే అర్థమౌతుంది. ఎస్.. ఇది బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫొటో.

అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు బిగ్ బి. ఈ మూవీలో థగ్గు అనే బందిపోటు పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు. ఆ సినిమాకు సంబంధించిన స్టిల్ ఇది. నిజానికి ఈ ఫొటో అఫీషియల్ గా రిలీజ్ అవ్వలేదు. ఎవరో లీక్ చేశారు.

75 ఏళ్ల వయసులో కూడా బిగ్ బి డెడికేషన్ చూసి ముచ్చటపడుతున్నారు నెటిజన్లు. విపరీతమైన షేర్లు, లైకులతో ఈ ఫొటోను ట్రెండ్ చేసి పడేశారు. ఈ హంగామాలో పడి లీకేజీ సంగతి కూడా మరిచిపోయారు.

కత్రినాకైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళి కానుకగా సినిమా విడుదలకానుంది.