షూటింగ్ అప్ డేట్స్ (14 మార్చ్ 2018)

Wednesday,March 14,2018 - 05:06 by Z_CLU

ప్రస్తుతం కొన్ని సినిమాలు షూటింగ్ ప్రాసెస్ లో ఉన్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాల లేటెస్ట్ స్టేటస్ ఇదే.

ఆఫీసర్ :

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న ‘ఆఫీసర్’ షూటింగ్ 99 % శాతం పూర్తయింది. ఈ సినిమాకు సంబందించిన మిగిలిన ప్యాచ్ వర్క్ సోమవారం నుండి జరగనుంది. కంపనీ బ్యానర్ పై యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ సరసన మైరా సరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. మే25 న సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమా విడుదల అవుతుంది.

‘నోటా’ :

విజయ్ దేవరకొండ నటిస్తున్న తమిళ్, తెలుగు బై లింగ్వెల్ సినిమా ‘నోటా’ ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. ఆనంద్ శంకర్ డైరెక్షన్ లో పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా చెన్నైలో  మరో వారం పాటు షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో విజయ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఆట గాళ్ళు :

జగపతి బాబు -నారా రోహిత్ కాంబినేషన్ లో పరుచూరి మురళి తెరకెక్కిస్తున్న ‘ఆట గాళ్ళు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. జగపతి బాబు నారా రోహిత్ తో పాటు మరికొందరు నటీ నటులపై కొన్ని సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై  వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సాయి ధరం తేజ్ -కరుణాకరన్ సినిమా :

సాయి ధరం తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ సినిమాలో సాయి ధరం తేజ్ కి హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకేక్కుతున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కే.ఎస్.రామారావు, వల్లభ నిర్మిస్తున్నారు.

బెల్లం కొండ శ్రీనివాస్ కొత్త సినిమా 

బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం శంషాబాద్ పరిసర ప్రాంతంలో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు యూనిట్.  వంశధార క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై నవీన్ సొంటినేని (నాని) ఈ సినిమా  నిర్మిస్తున్నారు.