మారుతి మార్క్ తో వస్తున్న మరో సినిమా

Tuesday,September 18,2018 - 12:02 by Z_CLU

మారుతి అంటే ఇప్పుడొక బ్రాండ్. అతడి సినిమాలకు మినిమం వసూళ్లు గ్యారెంటీ. ఇప్పుడు అదే బ్రాండ్ పై వస్తోంది భలే మంచి చౌక బేరమ్. మారుతి అందించిన డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

అరోళ్ళ గ్రూప్‌ పతాకంపై అరోళ్ళ సతీష్‌కుమార్‌ నిర్మించిన ఈ సినిమాకు మురళీకృష్ణ ముడిదాని దర్శకుడు. అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్‌ టైగర్‌, ‘పంతం’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ ‘భలే మంచి చౌక బేరమ్‌’ చిత్రాన్ని సమర్పించడం విశేషం.

నవీద్‌, ‘కేరింత’ నూకరాజు, యామిని భాస్కర్‌, రాజారవీంద్ర, భద్రం, ముజ్‌తబా అలీ ఖాన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి…
కాన్సెప్ట్‌: మారుతి
కథ, మాటలు: రవి నంబూరి
సంగీతం: హరి గౌర
బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: జె.బి
పాటలు: పూర్ణాచారి
సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి
ఎడిటింగ్‌: ఉద్ధవ్‌ ఎస్‌.బి
ఆర్ట్‌: మురళి ఎస్‌.వి
సమర్పణ: కె.కె.రాధామోహన్‌ (శ్రీసత్యసాయి ఆర్ట్స్‌)
సహ నిర్మాతలు: గుడ్ సినిమా గ్రూప్
నిర్మాత: అరోళ్ళ సతీష్‌కుమార్‌
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మురళీకృష్ణ ముడిదాని