బెస్ట్ హీరోస్ – 2017

Friday,December 29,2017 - 08:30 by Z_CLU

టాలీవుడ్ లో ఈ ఏడాది ది బెస్ట్ అనిపించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. కలెక్షన్ల పరంగా కొందరు, ప్రయోగాల పరంగా ఇంకొందరు, రీఎంట్రీల లిస్ట్ లో మరికొందరు.. ఇలా చాలామంది హీరోలు 2017లో ది బెస్ట్ అనిపించుకున్నారు.

ఈ ఇయర్ టాలీవుడ్ కు ఓ ప్రత్యేకత తీసుకొచ్చిన హీరో మెగాస్టార్. అవును.. చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఏడాదిగా చిరస్థాయిగా నిలిచిపోతుంది 2017. ఈ ఇయర్ చిరు తన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150ను విడుదల చేశారు.

 

2017కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఏడాదే బాలయ్య నటించిన వందో చిత్రం కూడా విడుదలైంది. నటసింహం నటించిన వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. క్రిష్ డైరక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

 

బన్నీ కెరీర్ లో కూడా ఈ ఇయర్ మెమొరబుల్ గా నిలిచిపోతుంది. దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించాడు బన్నీ. కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రం ఇదే.

 

అక్కినేని హీరో నాగచైతన్యకు కూడా ఇది మరపురాని ఏడాది. ఎందుకంటే హోం బ్యానర్ అన్నపూర్ణ స్టుడియోస్ లో సినిమా చేసి హిట్ కొట్టాడు చైతూ. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నాగచైతన్య నటించిన  రారండోయ్ వేడుక చూద్దాం సినిమా బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

 

తన జీవితంలో 2017ను ఎప్పటికీ మరిచిపోలేడు నాని. ఎందుకంటే, ఏ హీరోకు సాధ్యం కాని అరుదైన రికార్డును ఈ ఏడాది సాధించాడు. ఒకే ఏడాది హ్యాట్రిక్ కొట్టిన హీరోగా అవతరించాడు. నేచురల్ స్టార్ నటించిన నేను లోకల్, నిన్ను కోరి, ఎంసీఏ సినిమాలు ఒకే ఏడాది విడుదలై సూపర్ హిట్ అయ్యాయి.

 

టాలీవుడ్ బెస్ట్ హీరోస్ లో అందరికంటే ఫస్ట్ ఉండాల్సిన వ్యక్తి ప్రభాస్. బాహుబలి-2 సినిమాతో తన కెరీర్ బెస్ట్ హిట్ కొట్టడమే కాకుండా.. వసూళ్ల పరంగా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు యంగ్ రెబల్ స్టార్. 2017 సంవత్సరం ప్రభాస్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

 

అటు రానాకు కూడా  ఈ ఏడాది ఓ మధుర జ్ఞాపకమే. బాహుబలి-2 సక్సెస్ తో పాటు సోలో హీరోగా ఘాజి, నేనే రాజు నేనే మంత్రి సినిమాలతో హిట్లు కొట్టాడు ఈ దగ్గుబాటి హీరో.

 

వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్ కూడా ఈ ఏడాది తన సక్సెస్ రేట్ ను కొనసాగించాడు. అతడు నటించిన శతమానంభవతి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.

 

ఈ ఇయర్ వరుణ్ తేజ్ కు కూడా ఓ మంచి జ్ఞాపకాన్ని మిగిల్చింది. కెరీర్ లో ఫిదా రూపంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఈ మెగా హీరో.

 

2017 బెస్ట్ హీరోస్ జాబితాలో వెంకీకి కూడా స్థానం ఉంది. సినిమాలు తగ్గించినప్పటికీ క్వాలిటీ విషయంలో రాజీ పడడం లేదు విక్టరీ వెంకటేష్. అందుకే గురు సినిమాతో 2017లో కూడా తన మార్క్ చూపించాడు.

 

ఇక ఈ ఏడాది ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి అనే ఒకే ఒక్క సినిమా ఈ హీరోను స్టార్ ను చేసింది. అంతకంటే ముందు పెళ్లిచూపులు అనే విజయం ఉన్నప్పటికీ.. ఈ ఏడాది వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా పెళ్లిచూపులు సినిమాని కూడా మరిచిపోయేలా చేసింది.