రిపబ్లిక్ డే రోజున బెల్లంకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం' ఫస్ట్ లుక్

Tuesday,January 16,2018 - 07:07 by Z_CLU

బెల్లంకొండ శ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న ‘సాక్ష్యం’ మూవీ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ సినిమాతో మాస్ హీరో ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ హీరో, ఇప్పుడీ సినిమాలో సరికొత్త ఆంగిల్ లో ఎంటర్ టైన్ చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని జనవరి 26 న రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్.

జగపతిబాబు, శరత్ కుమార్ కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేస్తున్న యాక్షన్ సీక్వెన్సెస్  సినిమాలో హైలెట్ అవుతాయని చెప్తుంది సినిమా యూనిట్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి బుర్రా మాధవ్ డైలాగ్స్ రాస్తున్నాడు.