ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ సింగిల్

Tuesday,January 16,2018 - 07:46 by Z_CLU

వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ ఫస్ట్ సింగిల్ రిలీజయింది. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ తో ఎట్రాక్ట్ చేసిన ఫిల్మ్ మేకర్స్ , ఇప్పుడీ సింగిల్ తో ఫ్యాన్స్ లో ఇంటరెస్ట్ ని జెనెరేట్ చేయడం లో సూపర్ సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్  కరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అనిపించుకున్న ‘తొలిప్రేమ’ మూవీ టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నప్పటి నుండి ఈ సినిమా చుట్టూ నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. అయితే ఈ రోజు రిలీజైన ఫస్ట్ సింగిల్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారంటీ అనే అనిపిస్తుంది.

నిన్నిలా నిన్నిలా చూశానే’ అంటూ బిగిన్ అయ్యే ఈ సాంగ్ కి శ్రీమణి రాసిన లిరిక్స్, ఫీల్ నిండిన అర్మాన్ మాలిక్ వాయిస్ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాయి.. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్, ఈ ఫస్ట్ సింగిల్ లాగే, తక్కిన సాంగ్స్ కూడా అదే రేంజ్ లో కంపోజ్ చేసి ఉంటాడని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఫిబ్రవరి 9 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ ‘తొలిప్రేమ’ లో వరుణ్ తేజ్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. వెంకీ అట్లూరి డైరెక్టర్. BVSN ప్రసాద్ SVCC బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.