ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ తో బెల్లంకొండ

Thursday,January 02,2020 - 05:20 by Z_CLU

హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తన అప్ కమింగ్ మూవీ డీటెయిల్స్ రివీల్ చేశాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్ మెంట్ ట్రై చేస్తున్నట్టు ప్రకటించాడు. తన క్యారెక్టర్ తో పాటు మిగతా వివరాలు షేర్ చేశాడు.

“ఈ సినిమాలో మాట మీద నిలబడని పాత్ర నాది. అవసరం కోసం మారిపోవడం నా క్యారెక్టరైజేషన్. సినిమా మొత్తం ఎనర్జిటిక్ గా, మంచి ఫన్ తో ఉంటుంది. క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కామెడీనే. ఆఖరి 20 నిమిషాలు మాత్రం ఎమోషనల్ గా ఉంటుంది.”

“కామెడీ చేయాలని చేయడం లేదు. చాలా స్క్రిప్ట్ లు విన్న తర్వాత ఫైనల్ గా ఇది సెలక్ట్ చేశాం. సినిమా చాలా బాగా వస్తోంది. ఇప్పటికి 20 రోజులు షూటింగ్ అయింది. మార్చి చివరి నాటికి షూటింగ్ పూర్తిచేసి, ఏప్రిల్ లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి, మే నెలలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. వీలైనంత తొందరగా సినిమా పూర్తిచేయాలనేది ప్లాన్.”