బాలయ్య పాడిన పాట ఇదే

Tuesday,June 09,2020 - 05:52 by Z_CLU

ఓ పాట ప్రాక్టీస్ చేస్తున్నానని, త్వరలోనే దాన్ని వదుల్తానంటూ దాదాపు 4 రోజులుగా ఊరిస్తున్నారు బాలయ్య. ఎట్టకేలకు ఆ పాట రిలీజైంది. పాట చూసిన ప్రతి ఒక్కరు బాలయ్య గట్టి ప్రయత్నమే చేశారని అంటున్నారు.

ఇదే ఆ పాట. ఎన్టీఆర్ నటించిన జగదేకవీరుని కథ సినిమాలోని శివశంకరి పాటను ఆలపించారు బాలయ్య. ఏకంగా ఘంటశాల ఆలపించిన ఈ క్లిష్టమైన పాటను బాలయ్య సెలక్ట్ చేసుకోవడం పెద్ద సాహసమే. అయినప్పటికీ తనకు ఇష్టమైన పాట కావడంతో బాలయ్య కష్టపడి ప్రాక్టీస్ చేసి మరీ ఈ పాట పాడారు. శభాస్ అనిపించుకున్నారు.