బాలయ్య-బోయపాటి గర్జన మొదలైంది

Tuesday,June 09,2020 - 07:49 by Z_CLU

సాధారణంగా ముందు టైటిల్ వదుల్తారు, లేదంటే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు. కానీ వెరైటీగా బాలయ్య-బోయపాటి సినిమాకు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ కంటే ముందు టీజర్ వచ్చింది. బాలయ్య షష్టిపూర్తి సందర్భంగా.. ఫస్ట్ రోర్ అంటూ టీజర్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు చేసింది ఒక్క షెడ్యూల్ మాత్రమే. ఆ ఒక్క షెడ్యూల్ లో తీసిన యాక్షన్ ఎపిసోడ్ నుంచే టీజర్ కట్ చేశారు. లాక్ డౌన్ కారణంగా చెన్నైలో ఇంటికే పరిమితమైపోయిన తమన్, ఈ టీజర్ కు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.

టీజర్ లో బాలయ్య ఎలివేషన్ షాట్స్ తో పాటు ఓ మాస్ డైలాగ్ కూడా పెట్టారు. మరోసారి బాలయ్యను పెర్ ఫెక్ట్ గా చూపించడంలో బోయపాటి సక్సెస్ అయ్యాడు. సింహా, లెజెండ్ లో బాలయ్యను డిఫరెంట్ గా ప్రజెంట్ చేసిన ఈ దర్శకుడు.. తాజా చిత్రంలో కూడా బాలయ్య గెటప్ ను మిడిల్ ఏజ్డ్ వ్యక్తిగా బాగా డిజైన్ చేశాడు.

ఇక మిగిలింది అఘోరా గెటప్ మాత్రమే. ఫస్ట్ లుక్ కింద ఆ గెటప్ రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ అనుకుంటున్నారు.