బాలయ్య సరసన కొత్త హీరోయిన్

Tuesday,April 14,2020 - 01:54 by Z_CLU

బాలయ్య-బోయపాటి సినిమాలో హీరోయిన్ ఎవరనే టాపిక్ పై మొన్నటివరకు చాలా స్పెక్యులేషన్ నడిచింది. ఈ గాసిప్ లిస్ట్ లో చాలామంది పేర్లు కూడా వినిపించాయి. ఒక దశలో ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ భామల పేర్లు కూడా తెరపైకొచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెట్టాడు దర్శకుడు బోయపాటి. బాలయ్య సరసన ఓ కొత్తమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు ప్రకటించాడు

“మీడియాలో వస్తున్నట్టు మేం స్టార్ హీరోయిన్ ను తీసుకోవడం లేదు. ఓ కొత్తమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇద్దర్ని ఫైనల్ చేశాం. వీళ్లలో ఒకర్ని ఓ మంచి అకేషన్ చూసి ప్రకటిస్తాం.”

తన సినిమాలతో కొత్త హీరోయిన్లను పరిచయం చేయడం బాలయ్యకు కొత్తకాదు. ఇంతకుముందు ఎంతోమంది హీరోయిన్లను అలా పరిచయం చేశాడు. సో.. ఆ లక్కీ గాళ్ ఎవరనేది త్వరలోనే తేలిపోతుంది.