ఇంటిలిజెంట్ టీజర్ లాంచ్ చేసిన బాలయ్య

Saturday,January 27,2018 - 04:52 by Z_CLU

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్ సినిమా టీజర్ ను నందమూరి హీరో బాలకృష్ణ లాంచ్ చేశారు. సి.కల్యాణ్ నిర్మాతగా వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లలోకి రానుంది. ఓ మెగా హీరో సినిమా టీజర్ ను బాలయ్య రిలీజ్ చేయడంతో ఇంటిలిజెంట్ పై అందరి చూపు పడింది.

టీజర్ చూసిన బాలయ్య, సాయిధరమ్ తేజ్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఆసక్తిని టీజర్ రగిలించిందన్నారు. తప్పకుండా ఇంటిలిజెంట్ సినిమా చూస్తానన్నారు. టీజర్ లాంచ్ కార్యక్రమంలో తేజ్ తో పాటు నిర్మాత సి.కల్యాణ్, దర్శకుడు వీవీ వినాయక్ పాల్గొన్నారు.

లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. త్వరలోనే ట్రయిలర్ రిలీజ్ చేసి, భారీగా ప్రచారం ప్రారంభించబోతున్నారు.