జీ సినిమాలు ( 28th జనవరి)

Saturday,January 27,2018 - 10:02 by Z_CLU

మైసమ్మ IPS

నటీనటులు  : ముమైత్ ఖాన్, సాయాజీ షిండే

ఇతర నటీనటులు : రఘుబాబు, జీవా, బ్రహ్మానందం, M.S.నారాయణ, ప్రదీప్ రావత్

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. శ్రీలేఖ

డైరెక్టర్ : భరత్ పారెపల్లి

ప్రొడ్యూసర్ : దాసరి నారాయణ రావు

రిలీజ్ డేట్ : 2008

పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మైసమ్మను తన అక్క దుర్గ పెంచుతుంది. ఆ ఊళ్ళో రౌడీయిజం చలాయించే ఒక రౌడీ దుర్గను  పెళ్లి చేసుకుని వ్యభిచారం చేయిస్తున్నాడు. అన్నీ సహించిన దుర్గ, తన భర్త, మైసమ్మను బలాత్కారం చేస్తుంటే తట్టుకోలేక ఆ అమ్మాయిని తీసుకుని పారిపోతుంటుంది. అది చూసిన ఆ రౌడీ ఆ ఇద్దరి పైకి కుక్కలను ఉసి గొల్పుతాడు.ఎలాగోలా మైసమ్మను కాపాడుకున్న ఆమె ఆ కుక్కలా బారిన పడి చనిపోతుంది.  మైసమ్మ IPS గా ఎదిగి ఎలా పగ సాధిస్తుంది అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

భలే దొంగలు 

నటీనటులుతరుణ్, ఇలియానా

ఇతర నటీనటులుజగపతి బాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, సునీల్, ఎం.ఎస్.నారాయణ  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్కె.ఎం.రాధా కృష్ణన్

నిర్మాతశాఖమూరి పాండు రంగారావు , బెల్లం కొండ సురేష్

దర్శకత్వం –  విజయ్ భాస్కర్

విడుదల తేదీ – 11  ఏప్రిల్  2008

తరుణ్-ఇలియానా లతో దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించిన లవ్ & కామెడీ ఎంటర్టైనర్ సినిమా ‘భలే దొంగలు’. జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా లో తరుణ్-ఇలియానా మధ్య వచ్చే సీన్స్, ధర్మవరపు, సునీల్, బ్రహ్మానందం కామెడీ, రాధా కృష్ణన్ మ్యూజిక్ హైలైట్స్..

==============================================================================

శకుని

నటీనటులు : కార్తీ, ప్రణీత

ఇతర నటీనటులు : సంతానం, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, నాజర్, రాధిక శరత్ కుమార్, రోజా, కిరణ్ రాథోడ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : శంకర్ దయాళ్

ప్రొడ్యూసర్ : S. R. ప్రభు

రిలీజ్ డేట్ : 22 జూన్ 2012

కార్తీ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘శకుని’. రొటీన్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా కార్తీ కరియర్ లోనే వెరీ స్పెషల్ సినిమా. సంతానం పండించే కామెడీ తో, బోర్ కొట్టకుండా సినిమాలో ఎప్పటికప్పుడు వచ్చే ట్విస్ట్ లే ఈ సినిమాకి హైలెట్. ఈ సినిమాలో ప్రణీత హీరోయిన్ గా నటించింది.

==============================================================================

శివయ్య

నటీనటులు : రాజశేఖర్, సంఘవి, మోనికాబేడి

ఇతర నటీనటులు : చలపతి రావు, అశోక్ కుమార్, రమాప్రభ, AVS, అనంత్, గిరిబాబు, వేణు మాధవ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ లేఖ

డైరెక్టర్ : సురేష్ వర్మ

ప్రొడ్యూసర్ : డా. డి. రామానాయుడు

రిలీజ్ డేట్ : 1998 మార్చి 27

ఆంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ శివయ్య. మోనికా బేడీ, సంఘవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి సురేష్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో రవిబాబు విలన్ ఇంట్రడ్యూస్ అయ్యాడు.

==============================================================================

నా పేరు శివ

నటీనటులు : కార్తీ, కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : జయప్రకాష్, సూరి, రవి ప్రకాష్, రాజీవన్, విజయ్ సేతుపతి, లక్ష్మీ రామకృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ :  సుసీంతిరన్

ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేళ్ రాజా

రిలీజ్ డేట్ : 20ఆగష్టు 2010

సుసీంతిరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ నా పేరు శివ.  యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. థ్రిల్లింగ్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.