Balayya - మరోసారి సంక్రాంతి బరిలో?

Saturday,April 24,2021 - 01:59 by Z_CLU

కొందరు హీరోలకి సంక్రాంతి హీరో అనే బిరుదు ఉంది. అందులో సీనియర్ హీరో బాలకృష్ణ మొదటి వరుసలో ఉంటారు. బాలయ్య నుండి సంక్రాంతి కొచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి.  తన సినిమాలు సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ అయ్యేలా ముందే ప్లాన్ చేసుకునే బాలయ్య రెండేళ్ళుగా సంక్రాంతి సీజన్ కి దూరంగా ఉన్నాడు. అయితే ఈసారి మాత్రం మళ్ళీ సంక్రాంతి బరిలో నిలిచే సన్నాహాల్లో ఉన్నారు నందమూరి నటసింహం.

అవును.. ప్రస్తుతం బోయపాటి శ్రీను తో చేస్తున్న ‘అఖండ’ పూర్తవ్వగానే గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు బాలయ్య. ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపేందుకు ఇప్పట్నుండే ప్లాన్ చేస్తున్నారు.

ఇక గోపీచంద్ మలినేని కి కూడా ఈ ఏడాది సంక్రాంతి క్రాక్ రూపంలో బాగా కలిసి రావడంతో అతను కూడా సినిమాను సంక్రాంతి కల్లా రెడీ చేసే ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం కరోన వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మే నెలలో సెట్స్ పైకి వెళ్ళాల్సిన ఈ సినిమా జూన్ నుండి షూటింగ్ మొదలు కానుంది. 5-6 నెలల్లో షూట్ మొత్తం పూర్తి చేసి 2022 సంక్రాంతి కి థియేటర్స్ లోకి సినిమాను తీసుకురావాలనేది ప్లాన్. షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకే డేట్ లాక్ చెస్ ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు.

ఇక క్రాక్ లో మాస్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్ లాంటివి ఇందులో కూడా ఉండేలా కథను సిద్దం చేశాడట మలినేని. బాలయ్య ని ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చూపిస్తూ మాస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెపించే భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నాడట. ఇటివలే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

gopichand malineni paper library reaserch for balakrishna movie

క్రాక్ కథను ఒంగోలు నేపథ్యంలో తెరకెక్కించిన దర్శకుడు ఈ సారి కూడా బాలయ్య సినిమా కోసం ఒంగోలు బ్యాక్ డ్రాప్ నే సెలక్ట్ చేసుకున్నాడు. కథ కోసం ఆల్రెడీ రీసెర్చ్ కూడా మెదలుపెట్టాడు. వందేళ్ల చరిత్ర కలిగిన ఓ లైబ్రరీలో పాత పేపర్లు తిరగేస్తూ కనిపించాడు. ఓ మాస్ డైరక్టర్, ఊర మాస్ హీరో కలిసి సంక్రాంతి బరిలో అడుగుపెడుతున్నారు. గెట్ రెడీ

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics