Satyadev - 10 ఇయర్స్ ఇండస్ట్రీ
Saturday,April 24,2021 - 04:04 by Z_CLU
నటుడిగా పదేళ్ళు పూర్తి చేసుకున్నాడు సత్య దేవ్. ఈ యంగ్ హీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టి సరిగ్గా పదేళ్ళవుతోంది. తొలుత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సత్య, ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎట్టకేలకు హీరోగా మారి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లో ప్రభాస్ ఫ్రెండ్ గా కనిపించిన సత్య ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో మహేష్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. ఇలా మొదట్లో వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొని కొత్త నటులు ఇన్స్పైర్ అయ్యేలా తన కెరీర్ ని మలుచుకున్నాడు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జ్యోతి లక్ష్మి’ సినిమాతో హీరోగా మారాడు సత్య. ఆ సినిమాలో తన నటనతో అందరినీ ఎట్రాక్ట్ చేసి తర్వాత నటుడిగా మరింత బిజీ అయ్యాడు.
‘జ్యోతి లక్ష్మి’ తర్వాత కూడా హీరోగానే సినిమాలు చేయాలి అని పట్టుబట్టి కూర్చోకుండా మంచి పాత్రలు పోషించాడు. ‘ఘాజీ’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘అంతరిక్షం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాల్లో మంచి పాత్రలు చేసి మంచి నటుడు అనే గుర్తింపు అందుకున్నాడు.

సత్యదేవ్ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా ‘బ్లఫ్ మాస్టర్’. ఈ సినిమాతో అతడి టాలెంట్ ఏంటో అందరికీ తెలిసొచ్చింది. సోలో హీరోగా వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. తమిళ్ లో సూపర్ హిట్టయిన ‘శతురంగ వెట్టయ్’ కి రీమేక్ గా తెరకెక్కిన ‘బ్లఫ్ మాస్టర్’ సత్య దేవ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా చెప్పుకోవచ్చు. సినిమా కమర్షియల్ గా ఆడకపోయినా రిలీజ్ తర్వాత ఓ టి టి, యూ ట్యూబ్ ద్వారా బాగా రీచ్ అయ్యింది. ఈ సినిమా చూసి మెగాస్టార్ పిలిచి మరీ సత్యదేవ్ ని మెచ్చుకున్నారు. తన సినిమాలో ఓ రోల్ కూడా ఆఫర్ చేశారంటే ఆ సినిమాలో సత్య పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక లేటెస్ట్ గా సత్య దేవ్ హీరోగా నటించిన ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య’ సినిమా OTT లో డైరెక్ట్ గా విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో హీరోగా మరో మెట్టు పైకెక్కాడు సత్య. సినిమా చూసిన అందరూ సత్య దేవ్ నటనను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

ఈ పదేళ్ళ కెరీర్ లో సత్య దేవ్ చేసిన పాత్రలు, ఎంచుకున్న సినిమాలు చూస్తే నటుడిగా అతనిపై ఓ గౌరవం పెరగడం ఖాయం. అందుకే ఈ యంగ్ హీరోకి టాలీవుడ్లో ఆఫర్ల వెల్లువలా వస్తున్నాయి. ప్రస్తుతం హీరోగా ‘గాడ్సే’ , ‘గుర్తుందా శీతాకాలం’, ‘తిమ్మరుసు’ సినిమాలు చేస్తున్న సత్య దేవ్ త్వరలోనే మెగాస్టార్ ‘లూసిఫర్’, నితిన్ ‘పవర్ పేట’ సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేయబోతున్నాడు.
ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు వచ్చిన క్యారెక్టర్స్ కి నో చెప్పకుండా నటుడిగా ఫుల్ బిజీ గా ఉంటూ సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తున్న సత్య నటుడిగా మరింత ఉన్నత స్థాయికి చేరాలని మరెన్నో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ, ఇండస్ట్రీలో పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తోంది ‘జీ సినిమాలు’.
- – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
stories, Gossips, Actress Photos and Special topics