బాహుబలి 2 బిజినెస్ అప్ డేట్స్

Friday,March 24,2017 - 08:08 by Z_CLU

రిలీజ్ కి ముందే లాభాల బాట పట్టిన బాహుబలి 2 ట్రేడ్ వర్గాల్లో సరికొత్త ఆసక్తిని రేపుతుంది. బాహుబలి 1 తో పాటు ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్న బాహుబలి 2 కి ప్రొడ్యూసర్స్ స్పెండ్ చేసిన మొత్తం బడ్జెట్ 450 కోట్లయితే, బాహుబలి 1 ఆల్ రెడీ 600 కోట్లు వసూలు చేసి ప్రొడ్యూసర్స్ కి 250 ఓట్ల షేర్ ని మిగిల్చింది. ఇక బాహుబలి 2 థియేటర్ కలెక్షన్స్ తో పాటు, తక్కిన మర్చండైజ్, గేమ్స్, స్యాటిలైట్ రైట్స్ ఇవన్నీ కలిపి దాదాపు 400 నుండి 500 కోట్ల వరకు వసూళ్లు సాధించడం ఖాయమని కాన్ఫిడెంట్ గా బాహుబలి బిజినెస్ టీమ్.

రిలీజ్ కి నెల రోజులు ముందుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంటున్న బాహుబలి 2 కేవలం స్యాటి లైట్స్ రైట్స్ పైనే 100 కోట్లు కలెక్ట్ చేసింది. డిజిటల్ రైట్స్ విషయంలో ఇంకా నిగోషియన్స్ జరుపుతూనే ఉంది. ఏప్రియల్ 28 న రిలీజవుతున్న బాహుబలి 2 ఒక్క ఇండియాలోనే నాలుగు భాషల్లో 6500 థియేటర్స్ లో రిలీజవుతుంది. నార్త్ అమెరికాలో 750, ఇంకో 1000 థియేటర్స్ ఇతరత్రా  దేశాల్లో రిలీజవుతుంది.

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి ట్రేలర్ అని భాషల్లో కలిపి మొత్తం 65 మిలియన్స్ వ్యూస్ ని దాటేసింది. తెలుగు ట్రేలర్ 42 మిలియన్స్ దాటితే, హిందీ ట్రేలర్ 37 మిలియన్స్, తమిళ ట్రేలర్ 15 మిలియన్స్, మలయాళం లో 6 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఇప్పటికీ గంట గంటకి వ్యూస్ ని పెంచుకుంటూనే ఉంది బాహుబలి 2 ట్రేలర్. మరోవైపు మార్చి 26 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న సినిమా యూనిట్ అదే రోజు ఆడియోని కూడా రిలీజ్ చేస్తుంది.