వెంకటేష్ గురు సెన్సార్ క్లియరెన్స్

Friday,March 24,2017 - 04:50 by Z_CLU

వెంకటేష్ గురు సెన్సార్ క్లియరెన్స్ పూర్తయింది. క్లీన్ U సర్టిఫికెట్ పొందిన గురు ఏప్రిల్ 7 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. డిఫెరెంట్ లుక్ తో, డిఫెరెంట్ క్యారెక్టర్ లో వెంకటేష్ టఫ్ఫెస్ట్ బాక్సింగ్ కోచ్ గా నటించిన గురు ఆల్ రెడీ పాజిటివ్ టాక్ ని బ్యాగ్ లో వేసుకుంటుంది. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సాలా ఖడూస్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ఆడియెన్స్ లో ఇప్పటికే ట్రేలర్స్ తో ఫస్ట్ లుక్స్ తో కావాల్సినంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది.

ఈ సినిమా మేకోవర్ కోసం స్పెషల్ గా ట్రేనింగ్ తీసుకున్న వెంకటేష్, తన కరియర్ లోనే ఫస్ట్ టైం పాట కూడా పాడాడు. రితిక సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ స్పోర్ట్స్ ఎంటర్ టైనర్ కి సుధా కొంగర డైరెక్టర్. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు