కుర్ర హీరో రెండు సినిమాలు

Thursday,October 22,2020 - 05:05 by Z_CLU

యంగ్ హీరో Raj Tarun చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అవును లాక్ డౌన్ తర్వాత ఈ కుర్ర హీరో వరుస ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటూ బిజీ అయిపోయాడు. ఒక వైపు Vijay Kumar Konda దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేస్తూనే మరో వైపు Annapurna Stuios బ్యానర్ లో Srinivas Gavireddy డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్స్ గ్యాప్ లేకుండా పాల్గొంటున్నాడు రాజ్ తరుణ్. ఈ రెండు సినిమాలు పూర్తయ్యే లోపే Dream Girl రీమేక్ ను కూడా సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడు. వీటితో పాటు డెబ్యూ డైరెక్టర్ తో మరో సినిమా కూడా సైన్ చేసాడు. సో ఇలా వరుస సినిమాలతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తునాడు రాజ్ తరుణ్. మరి వీటితో ఈ కుర్ర హీరో ఎలాంటి విజయాలు అందుకుంటాడో చూడాలి.