Baby Movie జులై 14న రిలీజ్ ?

Tuesday,June 13,2023 - 04:57 by Z_CLU

జులై 2వ వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న బేబీ చిత్రం

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో బేబీ సినిమా ఒకటి. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్.కే.ఎన్ నిర్మించారు.

సినిమాలో కొన్ని పాటలు ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బేబి చిత్రానికి విజయ్ బుల్గానిన్‌ సంగీతం అందిస్తున్నాడు. ముందుగా ఈ సినిమా నుంచి ఓ రెండు మేఘాలిలా మరియు దేవరాజ అని రెండు పాటలు విడుదలై భారీ వ్యూస్ కొల్లగొట్టాయి.  రష్మిక మందాన ఈ సినిమా నుంచి విడుదల చేసిన బ్రేకప్ సాంగ్ ‘ప్రేమిస్తున్నా’ యూత్ కి బాగా కనెక్ట్ అయి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ ఆల్బమ్ నుంచి నాలుగవ పాట ఈ వారంలో విడుదలకు కానుంది.

టీజర్ , పాటలతో మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. జులై రెండో వారంలో 14 న వరల్డ్ వైడ్ గా బేబీ ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.