కొత్త టెక్నాలజీతో అవతార్ సీక్వెల్స్

Wednesday,June 28,2017 - 02:31 by Z_CLU

3D సినిమా చూడాలంటే కంపల్సరీగా కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిందే. 3D విజువల్స్ తో అద్భుత ప్రపంచంలోకి వెళ్ళే అనుభూతిని కలిగించే ఎక్స్ పీరియన్స్ ని పొందాలంటే ఇక 3D కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవతార్ లాంటి విజువల్ వండర్ ని తెరకెక్కించిన జేమ్స్ కామరాన్ ఫ్యూచర్ లో రానున్న అవతార్ సీక్వెల్ ద్వారా ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు.  కామరాన్ అండ్ లైట్ స్టామ్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాని క్రిస్టీ డిజిటల్స్ కొత్త RGB లేజర్ ప్రొజెక్షన్ సిస్టమ్స్ ద్వారా అవతార్ సీక్వెల్స్ ని  సరికొత్త ఫార్మాట్ లో ప్రెజెంట్ చేయనుంది.

సినిమా ప్రపంచంలో అవతార్ సినిమాతో సరికొత్త రివొల్యూషన్ ని క్రియేట్ చేసిన డైరెక్టర్ జేమ్స్ కామరాన్ అవతార్ ఫస్ట్ సీక్వెల్ 2020 లో రిలీజ్ అని అనౌన్స్ చేశాడు. అప్పుడే ఈ సినిమా చుట్టూ వరల్డ్ వైడ్ గా హై ఎండ్ డిమాండ్ క్రియేట్ అయి ఉంది. అంతలో కామరాన్ ఈ సీక్వెల్ ని గ్లాసెస్ ఫ్రీ  3D టెక్నాలజీ తో ప్లాన్ చేస్తున్నాడనే అప్ డేట్ వరల్డ్ వైడ్ గా అవతార్ సినిమా ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

అవతార్ 2 తో పాటు అవతార్ 3 ప్రొడక్షన్ పనులను ఒకేసారి బిగిన్ చేయనున్న టీమ్, అవతార్ 2 ని 2020 లో రిలీజ్ చేయనుంది. సరికొత్త టెక్నాలజీతో తెరకెక్కనున్న అవతార్ సీక్వెల్స్ వరల్డ్ వైడ్ గా వండర్స్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాయి.