పవన్ నెక్ట్స్ సినిమాపై సస్పెన్స్

Wednesday,June 28,2017 - 01:04 by Z_CLU

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. లెక్కప్రకారం ఈ మూవీ తర్వాత నేసన్ దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలి. ఏఎం రత్నం ప్రజంటర్ గా రానున్న ఆ మూవీ ఓపెనింగ్ ఫార్మాలిటీస్ కూడా పూర్తిచేసుకుంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా వచ్చే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. త్రివిక్రమ్ మూవీ తర్వాత నేసన్ సినిమానే ఉంటుందని కొందరంటున్నారు. మరికొందరు మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పవన్ సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. .త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా కంప్లీట్ అయిన తర్వాతే తన నెక్ట్స్ మూవీపై ఓ నిర్ణయం తీసుకుంటారు పవన్. అప్పటివరకు ఈ సస్పెన్స్ తప్పదు.

నేసన్ సినిమాకు సంబంధించి స్టోరీలైన్ ఓకే చేశాడు పవన్. కాకపోతే ఆ తర్వాత కథా చర్చలు కంటిన్యూ అవ్వలేదు. త్రివిక్రమ్ మూవీతో పాటు పొలిటికల్ గా కూడా బిజీ అయిపోవడంతో నేసన్ మూవీ ముందుకు కదల్లేదు. దీంతో వీళ్లిద్దరి కాంబోలో రావాల్సిన సినిమాపై అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి.