బంపర్ ఆఫర్ అందుకున్న రకుల్

Saturday,July 16,2016 - 08:59 by Z_CLU

 

చిన్న హీరోలతో పాటు ఒ మోస్తారు స్టార్ హీరోలతోనూ నటిస్తూ టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ సందడి చేస్తున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఒ బంపర్ ఆఫర్ అందుకుంది. త్వరలోనే మహేష్ సరసన కనిపించబోతుంది ఈ ముద్దుగుమ్మ. మురుగదాస్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ నటించబోయే సినిమాలో కథానాయికగా అవకాశం అందుకుంది ఈ పంజాబీ భామ. ఇక టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ ఈ చిత్రం విడుదల కానుండడం తో ఒకే సినిమాతో రెండు భాషల్లోనూ కథానాయికగా సందడి చేయబోతుంది రకుల్. ఈ బంపర్ ఆఫర్ కోసం మరి కొన్ని సినిమాలను వదులుకుంటుందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇప్పటికే గోపి చంద్ మలినేని దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్ సినిమాతో పాటు బోయపాటి సినిమా నుండి కూడా ఈ భామ తప్పుకుందని టాక్. మరి ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలన్న సిద్ధాంతాన్ని పాటిస్తుంది కాబోలు రకుల్.