కబాలి తరువాత వరుసగా..

Saturday,July 16,2016 - 09:23 by Z_CLU

 

 

సూపర్ స్టార్ రజిని కాంత్ తాజా చిత్రం ‘కాబలి’  ఎన్నో నెలల నుండి  ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకి విడుదలకి సిద్ధం అవుతుంది.  ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అధిక థియేటర్స్ లో జులై 22 న విడుదల కానుంది. అయితే ఇప్పటి వరకూ కబాలి ఎప్పుడెప్పుడు వస్తాడా? అని ఎదురుచూసిన కోలీవుడ్ టాలీవుడ్ సినిమాలకు ఓ ఊరట లభించింది. ఈ నెల 22 న కబాలి వచ్చేస్తుండడం తో  ఒ రెండు,మూడు  వారాల గ్యాప్ తరువాత తమ సినిమాలను విడుదల చెయ్యడానికి సిద్ధమవుతున్నారు కోలీవుడ్ టాలీవుడ్  నిర్మాతలు. ఇక రజిని నటించిన ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొనడం తో ‘కబాలి’కు భారీ థియేటర్సే దొరకనున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా రజిని కి ఉన్న క్రేజ్ తో ఈ సినిమా దాదాపు 300 కోట్ల పైనే కొల్లగొడుతుందని అంచానాలు వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక ఈ చిత్రం తొలి రోజు బ్లాక్ బస్టర్ అనే టాక్ గనుక అందుకుంటే ఇక కబాలి ను ఓ మూడు నాలుగు వారాల పాటు థియేటర్స్ నుండి తీసే ప్రయత్నం చెయ్యరు కాబట్టి   కబాలి రిజల్ట్ తరువైతే తమ సినిమాల విడుదల ను వరుసగా  ఖరారు చేసే  ఆలోచనలో ఉన్నారట కొందరు తమిళ తెలుగు చిత్ర నిర్మాతలు.