అర్జున్ సురవరం ఫస్ట్ డే కలెక్షన్

Saturday,November 30,2019 - 02:45 by Z_CLU

నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన అర్జున్ సురవరం సినిమాకు మొదటి రోజు డీసెంట్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కోటి 38 లక్షల రూపాయల షేర్ రాగా.. వరల్డ్ వైడ్ సినిమాకు 4 కోట్ల 10 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. సినిమాపై ఉన్న క్రేజ్, రిలీజైన థియేటర్ల కౌంట్ ను కలిపి చూసుకుంటే.. నిఖిల్ సినిమాకు మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చినట్టే లెక్క.

సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ అర్జున్ సురవరం అందుకుంటుందని ట్రేడ్ భావిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 9 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఎన్ని రోజుల్లో ఇది బ్రేక్ ఈవెన్ అవుతుందని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా మారింది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం -రూ. 0.31 కోట్లు
సీడెడ్ – రూ. 0.17 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.19 కోట్లు
ఈస్ట్ – రూ. 0.12 కోట్లు
వెస్ట్ – రూ. 0.10 కోట్లు
గుంటూరు – రూ. 0.29 కోట్లు
నెల్లూరు – రూ. 0.09 కోట్లు
కృష్ణా – రూ. 0.12 కోట్లు