రీతు వర్మకు లక్కీ ఛాన్స్

Saturday,November 30,2019 - 03:30 by Z_CLU

అందం ఉంది. యాక్టింగ్ టాలెంట్ ఉంది. ఎందుకో బడా ఛాన్సులు మాత్రం అందుకోలేకపోయింది.
ఇన్నాళ్లకు రీతూవర్మ కల నెరవేరింది. నేచురల్ స్టార్ నాని సరసన నటించే అవకాశం అందుకుంది. త్వరలోనే శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాని. ఇందులో హీరోయిన్ గా రీతూ వర్మను ఎంపిక చేశారు.

బాద్షా, ప్రేమ-ఇష్క్-కాదల్, ఎవడే సుబ్రమణ్యం లాంటి ఎన్నో సినిమాలు చేసింది రీతూ వర్మ. కానీ పెళ్లిచూపులు వరకు ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. ఆ సినిమా సక్సెస్ తో లైమ్ లైట్లోకి అయితే రాగలిగింది కానీ, క్రేజీ ఆఫర్లు మాత్రం అందుకోలేకపోయింది.

నిఖిల్ సరసన కేశవ సినిమా చేసి ఆ తర్వాత పూర్తిగా టాలీవుడ్ కు దూరమైంది. ప్రస్తుతం తమిళ సినిమాలే ఆమె చేతిలో ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో నాని సినిమాలో ఆమెకు ఆఫర్ రావడం గొప్ప విషయమే. రీతూ వర్మకు నటించడానికి మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్ దొరికింది ఈ సినిమాలో. ఇది క్లిక్ అయితే కచ్చితంగా పెద్ద బ్యానర్ల దృష్టిలో పడుతుంది ఈ చిన్నది.