Anushka Pic - ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్

Monday,May 17,2021 - 11:44 by Z_CLU

2 రోజులుగా సోషల్ మీడియాలో అనుష్క ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. అదేదో అందంగా ఉందని వైరల్ అవ్వడం లేదు. అందులో అనుష్క చాలా లావుగా ఉంది. దీంతో ప్రేక్షకుల్లో ఎన్నో అనుమానాలు పుట్టుకొచ్చాయి. అలా ఆ ఫొటో వైరల్ అయింది.

అసలు ఆ ఫొటో ఎలా బయటకొచ్చిందో ముందు చూద్దాం. అనుష్కకు చెందిన అఫీషియల్ సోషల్ మీడియా గ్రూప్ ఒకటి ఆ ఫొటోను రిలీజ్ చేసింది. చాన్నాళ్లుగా అనుష్క నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేసేందుకు ఆ ఫొటో వదలింది.

anushka

అయితే అది చూసి చాలామంది అనుష్క లేటెస్ట్ స్టిల్ అనుకున్నారు. ఈమధ్య ఏడాదిగా ఇంట్లోనే కసరత్తులు చేస్తూ, కఠినమైన డైట్ ఫాలో అవుతూ అనుష్క బరువు తగ్గినట్టు కథనాలు వచ్చాయి. అలాంటి టైమ్ లో వచ్చిన ఈ ఫొటోలో అనుష్క చాలా లావుగా ఉండడం చూసి చాలామంది కామెంట్స్ చేశారు.

ఊహించని విధంగా వచ్చిన విమర్శలతో ఉక్కిరిబిక్కిరైంది అనుష్క టీమ్. వెంటనే ఆ ఫొటోపై క్లారిటీ ఇచ్చింది. అది రీసెంట్ ఫొటో కాదని, ఏడాదిన్నర కిందట అనుష్క ఉత్తరాది పర్యటనకు వెళ్లినప్పుడు తీసిన ఫొటో అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

నిశ్శబ్దం తర్వాత ఇప్పటివరకు కొత్త సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు అనుష్క. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ పొలిశెట్టి హీరోగా ఆమె ఓ సినిమా చేయాల్సి ఉంది. అటు ఓటీటీలో ఓ ఫిమేల్ సెంట్రిక్ మూవీలో ఆమె నటించబోతోందంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. వీటిలో ఏ ప్రాజెక్టును అనుష్క ముందుగా సెట్స్ పైకి తీసుకొస్తుందో చూడాలి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics