SSMB28 - మహేష్ మూవీలో అక్కినేని హీరో
Monday,May 17,2021 - 11:53 by Z_CLU
మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో #SSMB28 సినిమా ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఆర్టిస్టులను ఫైనల్ చేసే పనిలో బిజీ గా ఉన్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే దాదాపు సినిమాలో పాత్రలకు సరిపడే నటీ నటులను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇక సినిమాలో ఓ ఇంపార్టెన్స్ ఉండే ఓ క్యారెక్టర్ కి అక్కినేని ఫ్యామిలీ నుండి సుమంత్ ని తీసుకున్నారని సమాచారం.

త్రివిక్రమ్ ప్రివియస్ ఫిలిం ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ఓ పాత్రకి అక్కినేని హీరో సుశాంత్ ని తీసుకొని అతని ఆ క్యారెక్టర్ ని చేయించాడు త్రివిక్రమ్. సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత సుశాంత్ కి మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు అలంటి రోల్ ఒకటి మహేష్ సినిమాలో కూడా రాసుకొని దానికి ఈసారి సుమంత్ తో చేయించాలని డిసైడ్ అయ్యాడట త్రివిక్రమ్. ఇక మహేష్ కి సుమంత్ క్లోజ్ ఫ్రెండ్. కొన్నేళ క్రితం నుండి వీరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్ షిప్ తోనే మహేష్ కూడా క్యారెక్టర్ సుమంత్ బెస్ట్ చాయిస్ అని చెప్పాడట.

ఈ నెల 31 న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన సందర్భంగా సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఆ వెంటనే షూటింగ్ మొదలయ్యే తేది మిగతా వివరాలు ఒక్కొక్కటిగా తెలియనున్నాయి. ఇక ఆ అప్ డేట్స్ లో సుమంత్ సినిమలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడని చెప్పనున్నారట. అలా చెప్తూ అక్కినేని హీరోకి వెల్కం చెప్పే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది. మరి స్నేహితుడు మహేష్ సినిమాలో సుమంత్ ఎలాంటి రోల్ చేస్తున్నాడు ? క్యారెక్టర్ లుక్ ఎలా ఉంటుంది ? లాంటి విషయాలు తొందర్లోనే తెలియనున్నాయి. హారికా హాసినీ క్రియేషన్స్ బేనర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హీరోయిన్ గా పూజ పేరు పరిశీలనలో ఉంది.
- – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
stories, Gossips, Actress Photos and Special topics