బాహుబలి నుండి మరో మోషన్ పోస్టర్

Friday,February 24,2017 - 02:10 by Z_CLU

టాలీవుడ్ మహా శివరాత్రిని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటుంది. కొత్త టీజర్స్ తో, ఫస్ట్ లుక్స్ తో, రిలీజ్ డేట్స్ తో ఫ్యాన్స్ కి ఎవరి స్టైల్ లో వాళ్ళు విష్ చేశారు. ఈ సెలెబ్రేషన్స్ లో బాహుబలి కూడా తన మార్క్ ని సరికొత్త స్టిల్ తో రిజిస్టర్ చేసుకుంది.

మహాశివరాత్రి సందర్భంగా బాహుబలి 2 సరికొత్త స్టిల్ ని రిలీజ్ చేశాడు జక్కన్న. సాహోరే బాహుబలి అంటూ ప్రభాస్ ఏనుగు తలపై పాదం పెట్టి, శౌర్యం ఉట్టి పడేలా నిలబడి ఉన్న స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తనదైన మార్క్ తో ట్రెండ్ అవుతుంది.

ఏప్రియల్ 28 న రిలీజ్ కి రెడీ అవుతున్న బాహుబలి 2 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రోజు రోజుకీ అవుట్ స్టాండింగ్ క్రేజ్ ని బ్యాగ్ లో వేసుకుంటున్న ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది.