నెక్స్ట్ ఏంటో తెలిసిపోయింది

Friday,February 24,2017 - 04:14 by Z_CLU

నిన్న మొన్న ఇలా సెట్స్ పైకి వెళ్ళాడో లేదో ఇలా టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసేశాడు నాని. ‘నిన్ను కోరి’ అనే మెలోడియస్ టైటిల్ తో అవుట్ స్టాండింగ్ లుక్ మెస్మరైజ్ చేసిన నాని, మరి మహాశివరాత్రి కదా, అందునా న్యాచురల్ స్టార్ బర్త్ డే కూడాను… ఎక్స్ పెక్టేషన్స్ న్యాచురలే. ఏముంది ఆ రేంజ్ లో సర్ ప్రైజింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినా, ఫ్యాన్స్ మైండ్ లో మాత్రం బర్త్ డే కదా నెక్స్ట్ ఏంటి..? అనే క్వశ్చన్ రేజ్ కాకుండా ఆగలేదు. అందుకే సాలిడ్ సమాధానం ఇచ్చింది దిల్ రాజు సినిమా యూనిట్.

నాని బర్త్ డేకి విషెస్ చెప్తూనే నెక్స్ట్ ఏంటి..? కి సమాధానంగా M..C.. A.. అంటూ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. మరోసారి సెట్స్ పైకి రానున్న దిల్ రాజు, నాని కాంబో అటు ‘నిన్ను కోరి’ సినిమాకి ఇలా ప్యాకప్ చెప్తారో లేదో, ఈ M.C.A. తో సెట్స్ పై ఉండే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ సినిమా ఎవరి డైరెక్షన్ లో తెరకెక్కనుందో, నాని సరసన ఏ ముద్దుగుమ్మ జత కట్టనుందో, ఈ న్యాచురల్ స్టార్ సినిమాకి మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేస్తారో లాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరకాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.