Hot Topic : ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి సినిమా ?

Wednesday,March 30,2022 - 02:41 by Z_CLU

Anil Ravipudi to direct Jr NTR soon ?

ప్రస్తుతం ‘RRR’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న ఎన్టీఆర్ నెక్స్ట్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ లో ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ కానుంది. అలాగే బుచ్చి బాబు రెడీ చేస్తున్న ‘పెద్ది’ అనే స్క్రిప్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట తారక్. మరో వైపు మైత్రి నిర్మాణంలో ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ ప్రాజెక్ట్  లైన్లో ఉంది.

ఇప్పుడు వీటితో పాటు ఎన్టీఆర్ లిస్టులో మరో ప్రాజెక్ట్ చేరిందనే టాక్ వినబడుతుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. నిజానికి ‘పటాస్’ సినిమా టైంలోనే “నాకు కథ చెప్పమంటూ తారక్ గారు అడిగే వారని సరదాగా ఆట పట్టిస్తూ ఉండేవాడని” అనిల్ ఇటివలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. ఆ తర్వాత  తారక్ కోసం అనిల్ ఓ కథ రెడీ చేశాడు కానీ ఎందుకో వర్కౌట్ అవ్వలేదు.

ఇప్పుడు ఎట్టకేలకు ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నాడనే న్యూస్ బయటికొచ్చింది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్-అనిల్ రావిపూడి కాంబో న్యూస్ చక్కర్లు కొడుతూ హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ కాంబో సినిమా న్యూస్ లో నిజమెంతో మరికొద్ది రోజుల్లో తెలియనుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘F3’ షూట్ ఫినిష్ చేసి  బాలయ్య తో నెక్స్ట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ కూడా కొరటాల శివ సినిమాను కంప్లీట్ చేయాల్సి ఉంది. మరి చూడాలి ఈ కాంబో సినిమా కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో ?

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics