Macherla Niyojakavargam మాస్ లుక్ తో ఫస్ట్ ఎటాక్

Wednesday,March 30,2022 - 12:44 by Z_CLU

Nithiin’s ‘Macherla Niyojakavargam’ first attack released

నితిన్ హీరోగా ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘మాచర్ల నియోజిక వర్గం’ నుండి ఫస్ట్ టీజర్ రిలీజైంది. సినిమాలో నితిన్ కలెక్టర్ సిద్దార్థ్ రెడ్డి క్యారెక్టర్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. కలెక్టర్ సిద్దార్థ్ పై ఓ జాతరలో ఎటాక్ జరిగే యాక్షన్ సీక్వెన్స్ నుండి కొన్ని షాట్స్ తో నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ ఎటాక్ అంటూ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.  ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని ఫస్ట్ ఎటాక్ చూస్తే తెలుస్తుంది.

నితిన్ కి బర్త్ డే విషెస్ చెప్తూ రిలీజ్ చేసిన ‘మాచర్ల నియోజక వర్గం’ ఫస్ట్ ఎటాక్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో మూవీ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ మాస్ కంటెంట్ తో సినిమా చూడాలనే క్యూరియాసిటీ రైజ్ చేస్తుంది. ఈ టీజర్ తో సినిమాలో ఎలాంటి యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయో క్లియర్ కట్ చెప్తూ మాస్ విజువల్స్ తో ఎట్రాక్ట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

శ్రేష్ట్ మూవీస్ బేనర్ పై సుధాకర్ రెడ్డి , నిఖిత రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. నితిన్ సరసన కృతి శెట్టి , కేథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జులై 8న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు టీజర్ ఎండింగ్ లో రిలీజ్ డేట్ చెప్పేశారు మేకర్స్.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics