Suhas 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' ఫస్ట్ లుక్
Tuesday,April 11,2023 - 04:32 by Z_CLU
జీఏ2 పిక్చర్స్ బ్యానర్ నుండి వస్తున్న సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు మరియు దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్ తో కెరియర్ మొదలు పెట్టి ‘కలర్ ఫోటో’, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో హిట్స్ అందుకున్న సుహాస్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ పనులను ముగించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. జీఏ2 పిక్చర్స్, స్వేచ్ఛ క్రియేషన్స్, వెంకటేశ్ మహా నిర్మాణంలో దుశ్యంత్ కటికనేని ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు.

మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడిగా సుహాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.రిలీజ్ చేసిన పోస్టర్ లో మల్లికార్జున సెలూన్ షాప్ ను చూపిస్తూ, సెలూన్ షాప్ ముందు ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మెంబర్స్ ను రివీల్ చేసారు. సుహాస్ తో పాటు గోపరాజు రమణ, పుష్ప ఫేమ్ జగదీశ్ డప్పులు, సన్నాయి తో పాటు పలురకమైన మంగళవాయిద్యాలతో ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచుతూ ఆకట్టుకుంది. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయనున్నారు.