డిసెంబర్ 4 నుండి బొమ్మ పడుద్ది !

Tuesday,December 01,2020 - 02:54 by Z_CLU

Covid19 కారణంగా మూత పడిన సినిమా థియేటర్లు రీ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పటికే చెన్నై , బెంగళూరు లాంటి ప్రదేశాలతో పాటు విజయవాడలో కూడా థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాయి.  హైదరాబాద్ లోని మల్టీ ప్లేక్స్ లతో పాటు సింగిల్ థియేటర్స్ కూడా సానిటైజింగ్ చేసుకుంటూ ప్రేక్షకులకు వినోదం పంచడానికి రెడీ అవుతున్నాయి.

డిసెంబర్ 4 నుండి AMB Cinemas రీ ఓపెన్ కాబోతుంది. తొలిరోజు మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ , అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, అర్జున్ రెడ్డి’, ‘కనులు కనులను దోచాయంటే’, వంటి తెలుగు సినిమాలతో పాటు TENET లాంటి హాలీవుడ్ మూవీ అలాగే ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ హిందీ సినిమాను ప్రదర్శించబోతున్నారు.

AMBCinemas re-open-news-zeecinemalu

రీ ఓపెన్ అవుతున్న సందర్భంగా కోవిడ్ కి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకొని కేవలం 50 శాతం సీట్లను మాత్రమే అమ్ముతున్నారు. ప్రస్తుతానికి గచ్చిబౌళిలో ఉన్న AMB ఒకటే ఓపెన్ అవుతుంది. రెండు మూడు రోజుల్లో సిటీలో  రీ ఓపెన్  కానున్న మరిన్ని థియేటర్స్  పై క్లారిటీ రానుంది. మరి ఈ  సినిమాలకు ప్రేక్షకుల నుండి ఎలాంటి ఆదరణ లభిస్తుందనేది  ప్రశ్నర్థంగా ఉంది.