హిస్టారికల్ బయోపిక్ లో నటించనున్న స్టార్..?

Saturday,February 02,2019 - 10:03 by Z_CLU

టాలీవుడ్ లో బయోపిక్ సీజన్ కి ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. మార్చి నుండి మరో హిస్టారికల్ బయోపిక్ సెట్స్ పైకి రానుంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు లైఫ్ ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజుగా కనిపించబోయే స్టార్ హీరో ఎవరా అనేది ఇంకా రివీల్ చేయలేదు మేకర్స్.

గతంలో అల్లూరి సీతారామ రాజు బయోపిక్ లో సూపర్ స్టార్ కృష్ణ నటించారు. ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి ఆ సినిమాకి, ఈ సినిమాకి మధ్య ఎలాంటి డిఫెరెన్స్ ఉండబోతుందనేది ప్రస్తుతానికయితే  క్లారిటీ లేదు కానీ, ఈ సినిమా కోసం టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ ని అప్రోచ్ అయ్యే ప్రాసెస్ లో ఉన్నారట మేకర్స్.

ఈ సినిమా టైటిల్ ‘అల్లూరి సీతారామ రాజు’ అని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన మేకర్స్, ‘ఎ ట్రూ వారియర్’ అనే ట్యాగ్ లైన్ ని ఫిక్స్ చేసుకున్నారు. P. సునీల్ కుమార్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకి డా. శ్రీనివాస్ ప్రొడ్యూసర్. రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.